Tuesday, June 17, 2025

ఆచార్య దేవోభవ తేది : 05-09-2024 శీర్షిక : సరస్వతీ మాత ప్రతినిధి

 ఆచార్య దేవోభవ

తేది : 05-09-2024
శీర్షిక :  సరస్వతీ మాత ప్రతినిధి 
సహస్రాధికం 

సరస్వతీమాత సర్వప్రతినిధియై 
ఓంకారంతో మొదలెట్టి 
ఓనమాలను వల్లెవేయించి 
అక్షరాలతో అడుగులు వేయించి 
పదాలతో పరుగులు నేర్పించు ... 

తరగతులెన్నో దాటించి 
ఉత్తీర్ణతలతో హుషారు తెప్పించి 
బ్రతుకుదెరువులో బాట చూపించి 
బాధ్యతలను బహులెస్సగ బోధిస్తారు ..... 

శిలల లాంటి మనుషులను 
అందమైన శిల్పాలుగా చెక్కుతారు ... 
అజ్ఞానాలను  పారద్రోలి 
విజ్ఞాన గనులుగా మార్చుతారు .... 

చేతికి ఆరోవేలును తొడుక్కుని 
అహర్నిశలు నైపుణ్యం నేర్పి ....  
ఊరించే ఊహలకు రెక్కలు 
తొడిగే ఊపిరిలు ఊదెదవు .... 

విశ్వ వీచికను దృశ్యమానం 
చేసి వింతగా తరగతిగదిలో 
బంధించి తపించి బోధించు 
తన వారుగా భావించి శిష్యులకు ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment