కలం - గళం యుగళ గీతం
తేది : 24-08-2024
శీర్షిక : నింగి తొలకరి నీవైతే…
పల్లవి ...
ఆమె
నింగి తొలకరి నీవైతే అవనిమాతను నేనౌతా
వినుమా ఓ సఖుడా
చేకొనుమా ఓ విభుడా
అతడు
పరిమళములు చిలకరిస్తూ
కుసుమముమై విరిసావు
పరిసరాలు మరిపించే
వలపులను విసిరావు ....
చ . 1. ఆమె
వలపుల జడివానలో
తలుపులన్నీ విచ్చుకునే....
చిలిపి ఊహలు ముసురుకుని
కలలన్నీ సప్తవర్ణములాయె....
మనసు హారతి చేసాను
నా మనసు హారతి చేసాను ...
అతడు
నింగిలోన మెరుపై జ్వలించి
నీ మేనులోన లీనమౌతాను ....
మేఘములో ఉరుములా
నీ తనువెల్లా జడిపిస్తాను....
అల్లిబిల్లిగా అల్లుకుందాము
అల్లుకుని తేరుకుందాము....
చ. 2. ఆమె
రాగసుధలు ఒలకబోసి
గువ్వలమై ఒదుగుదమా ....
ప్రేమ తీరం చేరుకొని
కపోతాలుగ మారుదామా
నా మనసు పరితపించె
పరితపించి ఎదురుచూసె ...
చ. 2. అతడు .
గ్రహించానే నీ గుండె చప్పుడు
దరిచేరాను నే చెంత ఇప్పుడు
చిలిపి మనసును తెలుసుకున్నా
కలికి హృదయం కనుగొన్నాను ....
గుండె వాకిలి తెరిచాను
నిండుగా కొలువై ఉండుమా
నా దేవతవై కరుణించుమా
ఆమె
నింగి తొలకరి నీవైతే
అవనిమాతను నేనౌతా
వినుమా ఓ సఖుడా
చేకొనుమా ఓ విభుడా
అతడు
పరిమళములు చిలకరిస్తూ
కుసుమముమై విరిసావు
పరిసరాలు మరిపించే
వలపులను విసిరావు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment