అనుభవం గొప్ప గురువు
తేది : 21-08-2024
శీర్షిక : సంపదల కోట
ఎంత దూరమైనా ఒక్క అడుగుతోనే
ప్రారంభం ... అడుగు అడుగు పడితేనే
అనుభవాలు పొదువుకునేది ...
ఆపదలను దాటుకునేది ....
బాధ్యతలెరుగని బాల్యం
కలలు కనే కౌమారం
బ్రతుకుదెరువుల పోరాటంలో
వెలుగు నింపే యవ్వనం
దేనికదే గొప్ప జ్ఞాపకం ...అయినా
అన్నీ దాటుకుని వార్ధక్యం వాకిలిలో
నిలిచినవారికున్న అనుభవాల మూట
లెక్కలేనన్ని సంపదల కోట ....
కొన్ని పనులు కష్టమైనా
ఇష్టమైతే సులభమే ....
ఇష్టాలకు ఇగురంగా నైపుణ్యం
జోడిస్తే నగిషీలు చెక్కినట్టే ....
చేతి వృత్తులకు చేవ జోడిస్తే
తిరుగులేని ఆకృతులే ....
కమ్మరి కుమ్మరి కంసాలి కంచరి
నేతపని కుట్టుపని మేదరి మొదలగునవి
నాన్నల సారథ్యంలో పదును పెట్టొచ్చు ...
అక్షరజ్ఞానాలకు అమ్మ తోడైతే
పెద్ద చదువులకు ఇతర వృత్తులకు
ఇతోధికమై గుంభనముగా గురువులు
కరుణిస్తేనే బరువు దీరు ...
కార్పొరేట్ కల్చర్ లో
కొట్టుమిట్టాడుతున్న
సరికొత్త చదువులోలె
సిద్ధాంతాల రాద్ధాంతం కాకుండా
లౌక్యంగా పనులు చక్కబెట్టే
నిక్కచ్చి సందర్భాలలో....
అనుభవాల నీడలే ఆశా జ్యోతులు ...
అనుభవజ్ఞుల మాటలే
నవతరానికి వారధులు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment