Wednesday, June 11, 2025

పైన నీలి తెర - కింద ధూళి పొర తేది 30-08-2024 శీర్షిక : కళ్ళు తెరవకపోతే ...

 పైన నీలి తెర - కింద ధూళి పొర

తేది 30-08-2024
శీర్షిక : కళ్ళు తెరవకపోతే ... 


అవని పైన మన  బ్రతుకైనా 
ఆ పంచభూతాల వరప్రసాదమే. 
ఏదేనిని మనం కాదన్నా 
నేల విడిచి సాము చేసినట్టే ... 

కరుగుతున్న ఓజోను నీలి పొర  
పెరుగుతున్న అవని ధూళి పొర 
వెనుతిరిగి చూడని మానవాళి 
కనుమరుగయ్యేనా  ఇక  జీవరాశి ... 

చెవిటివాని ముందు శంఖమూదినట్టు  
దశాబ్దాలనుండి కాలుష్య రోదనలే ... 
విడమరిచి చెప్పడమే కానీ 
కడతేర్చడానికి  కదం కలపం ... 

అలసత్వాలతో అంట కాగుతూ 
జవసత్వాలను మంటగలిపే 
కాలుష్యాల నెగళ్ళకు కళ్ళెం వేయని  
ప్రజలు ప్రభుత్వాలు…మిడతల దండులా...  

ఉడతా భక్తిగా సాయం చేసేది 
అక్కడో ఇక్కడో  లక్షల్లో ఒక్కరు మాత్రమే .... 
ఇకనైనా మనుషులంతా  పూనుకోపోతే 
అప్పుడో ఇప్పుడో  మాయమే భూగోళం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment