Wednesday, June 11, 2025

సాంకేతిక తేది :04-09-2024 శీర్షిక : అత్యాధునిక సాంకేతికత

 సాంకేతిక 

తేది :04-09-2024 
శీర్షిక : అత్యాధునిక సాంకేతికత 

పిట్ట కొంచం కూత ఘానంలా 
తక్కువ సమయంలో ఎక్కువ 
మరియు వేగంగా పనులు పూర్తి 
చేసుకునే సౌకర్యమే  సాంకేతికత ....  

నాగరికతలో నడక సాగించిన 
జీవితం ... పారిశ్రామిక ప్రగతితో 
పరుగులు మీద పరుగులు పెట్టి 
ప్రశాంతతలు తగ్గిపోయాయి .... 

ఏకంగా సాంకేతికతలో అడుగు 
పెట్టాక  పరుగులు  దాటి పోయి 
వేగమందుకునే విధంగా పరకాయ 
ప్రవేశం చేయాల్సివస్తుంది .... 

పక్షులనే తలదన్నే విధంగా 
గగనపు వీధులలో పయనిస్తూ 
ఖండాంతరాలు దాటి పోయి 
గ్రహాంతరాలకు వారధులమైనాము .... 

కంప్యూటర్లలో అడుగిడి 
కథాకళి ఆడుకుంటూ  ఆర్టిఫిషల్
ఇంటలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ 
ఆటోమేషన్  డేటా కలెక్షన్ వంటి 
అడుగులతో పాటుగా ...  ఆగ్మెంటేడ్ 
రియాలిటీ వర్చువల్ రియాలిటీ  అనే 
మరికొన్ని అడ్వాన్సుడ్  ముందడుగులు 
పడే ఆస్కారం ఎంతో దూరంలో లేదు....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment