Wednesday, June 11, 2025

వినాయకుని పాట తేది 03-08-2024 శీర్షిక : స్వాగతము గణపయ్యా ...

 మీ పాట మీ నోటా .... వినాయకుని పాట 

తేది  03-08-2024
 శీర్షిక : స్వాగతము గణపయ్యా ... 
 
స్వాగతము గణపయ్యా 
స్వాగతము వినాయకా 

అమ్మచేత నలుగుపిండి 
ఆకారం దిద్దుకొనగా .... 
అవతరించి నిలిచావు 
అయోనిజా వందనము ....  

భాద్రపద శుద్ధ చవితి 
బహుగొప్ప పండగయా 
బంగారు పూజలన్నో 
భజియించి చేసెదము ....

స్వాగతము గణపయ్యా 
స్వాగతము వినాయకా 

మండపాలు ఊరూరా 
దండిగాను  వేసినాము .... 
అర్చనలు పూజాలెన్నో 
అవనిపైన చేసెదము .

వెండికొండ దిగిరావా 
వెన్నమనసు దొరవునీవు ... 
సపరివార సమేతమై 
పూజలంద భువిపైనా .... 

స్వాగతము గణపయ్యా 
స్వాగతము వినాయకా 

వనమంతా పత్రితెచ్చి 
ఘనమైన పూజ చేతు .... 
మనమున కోరుకున్న 
దినముననే విజయించు .... 

కుడుములు ఉండ్రాళ్లతో 
నైవేద్యము పెట్టెదను .... 
ఇడుములను బాపి మమ్ము 
కరుణించగా రావయ్యా ...  

స్వాగతము గణపయ్యా 
స్వాగతము వినాయకా 

అమ్మానాన్నలే అందరికి 
ఆదిపూజ్యమని బోధించావు ... 
తొలిపూజలు నీకేనని 
వరములనే పొందినావు .... 

ఓంకారము రూపముగా 
చదువులమ్మ ప్రతినిధిగా 
విజ్ఞానము ప్రసరింపగా 
జ్ఞానబోధ చేయుమయా ... 

స్వాగతము గణపయ్యా 
స్వాగతము వినాయకా 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment