Wednesday, June 11, 2025

లాటరీ 27-08-2024 శీర్షిక : చట్టాలలోని లొసుగులు.

 లాటరీ 

27-08-2024
శీర్షిక : చట్టాలలోని లొసుగులు.  

వాన బిందువులన్నీ కలిసి
వరద బీభత్సమైనట్టు… 
వరములందించి లక్ష్మీదేవి
వారి చింతలు దీర్చు…. 

లక్షల మంది కష్టార్జితాలను
ఒక్కని సొంతం చేయడమే ... 
ఆశల తీగకు వేసుకునే 
కాలపు గాయాలు మాన్పె గాలం ... 

పేరు గొప్ప ఊరు దిబ్బలా
ఫలమందేవాడికి ఫలహారమే
దళారీలకు దండి కమీషను 
ప్రభుత్వాలకు సంపద పన్నులు … 

వెంట్రుక వేసి కొండను లాగినట్టు
చిరు చిరు మొత్తాలతోనే 
కండ్లు మిరిమిట్లు గొలిపే
కడు పెద్ద మొత్తాల ప్రైజులు…. 

కొంత మందికి దుర్వ్యసనమై
దుర్మార్గపు ఆలోచనలకు 
కోటగోడలా నిలబడి సంఘంలో
అల్లకల్లోలాలకు అశాంతికి కేంద్రం…. 

చట్టాలలోని లొసుగులు 
చుట్టాలవుతున్న పెట్టుబడులు… 
కట్టుబాటైన  నిర్ణయాలతోనే
తొట్రబాటులేని విజయాలు… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment