Wednesday, June 11, 2025

అంతరిక్ష రంగంలో భారతదేశ విజయాలు తేది : 23-08-2024 శీర్షిక ; సువర్ణాధ్యాయం ...

 అంతరిక్ష రంగంలో భారతదేశ విజయాలు

తేది : 23-08-2024
శీర్షిక ; సువర్ణాధ్యాయం ... 

ఆకాశాన్ని హద్దుగా చేసుకుని 
మానవాళి కృషి ఓ అద్భుతం ... 
భారతదేశం కూడా అవకాశం 
వదలకుండా అక్షరాలా అమలు 
చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు.... 

నిప్పులు కక్కే అనేకానేక దేశ విదేశాల 
వైవిధ్యమైన ఉపగ్రహాలను 
కుప్పలు కుప్పలుగా పంపించే 
పనిలో నిరంతరం నిమగ్నమే.... 

104 ఉపగ్రహాలను ఏక కాలంలో 
పంపించి అత్యుత్తమ పనివిధానాలతో 
చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో 
ఘనత లిఖించుకున్నారు.... 

వేదాలలోనే నిక్షిప్తం ... 
రామాయణ మహాభారత కాలాలలో 
పుష్పక విమానాల ముచ్చట్లెన్నో 
విన్నాం ... ఇపుడు చంద్రయాన్ 
మంగళయాన్  లతో మహోన్నతమాయే ... 

అమ్మ నోటా విన్న చందమామ 
రావే మాటకు ... మామగారింటికి 
శోధనలు పరిశోధనల పేరిట 
మనమే చేరడం మహాద్భుతం .... 

ఇంతవరకు ఒక లెక్క .... 
ఇప్పుడు మరో లెక్కంటూ 
దన్ను దొరికిన శాస్త్రవేత్తలు 
అడుగులలో దమ్ము చూపిస్తున్నారు .... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment