కలం గళం - జోల పాటలు
తేది 31-08-2024
శీర్షిక :
లాలి మా కన్నయ్యా
జో గోప బాల
జోజో గోపాల
లాలి శ్రీ కృష్ణయ్యా
లాలి మా కన్నయ్యా
అష్టమ గర్భముగా
అష్టమీ తిథి రోజు...
నిష్టగా జన్మించె
దేవకీ వసుదేవు పంటగా ....
ముక్కోటి దేవతలు
ఒక్కటిగా దీవించే ...
మురిపాల బాలున్ని
ముద్దు ముచ్చట దీరా ....
జో గోప బాల
జోజో గోపాల ...
లాలి శ్రీ కృష్ణయ్యా
లాలి మా కన్నయ్యా ....
వరముగా జన్మించే
చెరసాల లోనా ....
యముననే దాటేనే
వాయు వేగమ్మునా ....
చేరుకొనే క్షేమముగా
నంద యశోదింటా ...
గత జన్మ పూజలా
ప్రతిఫలమ్ముగానూ....
జో గోప బాల
జోజో గోపాల ...
లాలి శ్రీ కృష్ణయ్యా
లాలి మా కన్నయ్యా ....
అయినను వదలని
అసుర మూకలను ....
బాల్యమున దునుమాడే
భావి ధర్మ రక్షకుండు ....
లీలలెన్నో జూపె
గోపాల బాలుడూ ...
లీనమై మురిపించే
గోపెమ్మల మనసూ....
జో గోప బాల
జోజో గోపాల
లాలి శ్రీ కృష్ణయ్యా
లాలి మా కన్నయ్యా
నగునూరి రాజన్న
No comments:
Post a Comment