మీ పాట మీ నోట
తేది : 20-08-2024
శీర్షిక : శ్రావణ లక్ష్మి
పౌర్ణమిలో శ్రవణంతో
పాలుగారు మిళితమై...
వర్ధిల్లెను శ్రావణమై
ధరణిలోన హైందవం ...
చినుకు చినుకు పలకరించ
చిద్విలాసమే చల్లదనం ....
తొణకలేని సంప్రదాయం
తోడు నిలిచే పండుగలతో ...
పంచమితో నిలిచె కదా
పావనమై నాగుల చవితి
సంతానం కోసమని ప్రజలు
సాగిలపడి మొక్కెదరు...
పౌర్ణమిలో శ్రవణంతో
పాలుగారు మిళితమై...
నిండుగా వచ్చెనే శుక్రవారం
రెండవది వరలక్ష్మి వ్రతం
మెండుగా మొక్కెదరు అతివలు
మంగళగౌరీ వ్రతముగా ...
స్వాతంత్య్రం వచ్చెనని
సభలతో మురిసెదరు ...
మువ్వన్నెల పతాకం
మురిపంగా ఎగురవేసి ....
పౌర్ణమిలో శ్రవణంతో
పాలుగారు మిళితమై...
సోదరుల శుభంకోరి
రాఖీలు కడతారు...
అండదండా అంతా నీవేనని
అన్నదమ్ములుండాలని ....
చిన్ని చిన్న పాదాల
శ్రీకృష్ణుడొచ్చేవేళలు
కృష్ణాష్టమి పండగ కూడా
చిదానందమే ఈ మాసం ...
పౌర్ణమిలో శ్రవణంతో
పాలుగారు మిళితమై...
వర్ధిల్లెను శ్రావణమై
ధరణిలోన హైందవం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment