Wednesday, June 11, 2025

ఉల్లాస వల్లరి తేది : 23-08-2024 శీర్షిక : ఒకటొకటిగా…

 ఉల్లాస వల్లరి 

తేది : 23-08-2024
శీర్షిక : ఒకటొకటిగా…  
సహస్రాధికం 

ఉద్యమకాలపు కనుసన్నల్లో 
ఉనికి నిలబెట్టుకున్నదాఖలాలు ... 
ఇరవై శాతం ఉత్తీర్ణతలలోనే 
పదిలో పాసయ్యి...నిండా మునిగిపోయి  
పన్నెండు గట్టెక్కి చూపించాము .... 

ఉన్నత చదువుల్లో నైతే ఉద్దంఢుడైన 
బంగారు మూర్తి ఉపకులపతి హయాములో  
ఏకంగా ఉత్తీర్ణత పది శాతానికి పడిపోయినా ... 
పక్కాగా నిలబడి కలబడి గెలిచిన సంబరమే .... 

ఉన్నత చదువుల సరిదంటలలో  
ఉల్లాసాల కాలక్షేప కబంధ హస్తాలలో 
సాంకేతిక లేఖినిలో సైతం ఉత్తీర్ణత 
సాధిస్తే... ఊతమాయె ఉద్యోగార్హతమై  .... 
 
అమ్మా నాన్నల ఆశీర్వాదబలమో 
అమ్మవారి దీవెనలో కానీ ... అడుగిడిన 
చోటల్లా గెలుపు బాటల పలకరింపులే  ... 
నాలుగు  మారిపోయి ఐదవ చోట 
స్థిరమైపోయి బాధ్యతల బందీనయ్యాను.... 

కోరుకున్న బంధంలో చిక్కుకుని 
కోటి ఆశలకు నాందీ పలికాను ... 
నాలుగు దశాబ్దాల నడకలలో 
ఒకటొకటిగా అడుగులుపడి తీరుతూ 
విశ్రాంతములో విడిది చేసాక .... 
ఇంతకన్నా కోరుకునేదింకేముంటుంది.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment