వాణీ వాణీ వందనమమ్మా
నిరతము నీ కృప కావలెనమ్మాపదములు సరిగా పలుకుటకైనా
చదువుల సారం తెలుయుటకైనా
పనిలో దైవం చూచుటకైనా
పదుగురి మనసులు గెలుచుటకైనా
// వాణీ //
కవులకు కలములు కదులుటకైనా
సరిగమపదనిస సాగుటకైనా
వేదశాస్త్రములరయుటకైనా
భగవత్ ధ్యానం తెలియుటకైనా
// వాణీ //
మనసున మొహం వదులుటకైనా
మదిలో దీపం వెలుగుటకైనా
పదుగురి క్షేమం కోరుటకైనా
విశ్వ శాంతిని చేరుటకైనా
// వాణీ //
No comments:
Post a Comment