సమన్వయం
తేది: 18-07-2021
శీర్షిక : సంఘ జీవనం.
కవిత సంఖ్య: 145
శీర్షిక : సంఘ జీవనం.
కవిత సంఖ్య: 145
సంఘములో జీవనమంటేనే
సమన్వయాల సంపుటాలు
విభిన్న మనస్తత్వాల విదుర
నీతులే సమన్వయాల సర్వ కేంద్రం.....
ఐదు వేళ్ళు కలిసి అన్నం నోట్లో
పెట్టిన చందంగా సమన్వయం
చేసుకుంటేనే సరదా సంతోషాలు .....
పండగైనా పబ్బమైనా దండిగా
నిండుగా సాగిపోవాలంటే
అనేకవిషయాల అనుసంధానమే
సమన్వయ సంకేతం కాదా .....
ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలకైనా
యుద్ధరంగములో శస్త్రాలను
సంధించుటకైనా అనుభవజ్ఞుల
అవలీలలతలే అమూల్యమైన
అనుసంధానతలు .....
రైతన్నల యవుసమైనా
రచయితల కావ్యమైనా
కాలాలను కలుపుకుని
కాల్పనికతలు మేళవిస్తూ
సమన్వయం చేసుకుంటేనే
సరైన ప్రతిఫలాల పంట పండుతుంది ….
గుండుసూది తయారునుండి
కొండతొలుచు యంత్రాలవరకు
అడుగడుగున విడమరుస్తూ
అప్రమత్తమై నిర్వర్తించడమే
సమన్వయాల సంకేతము …..
ప్రభుత్వాలైనా పరిశ్రమలైనా
చేసినవి చేసేవి చేయబోయేవి
గతానుభవాల పరిచక్రంలో
అనుభవైక సలహాల సమీక్షలతో
సమన్వయము చేసుకుంటే మున్ముందు
విజయాల వినీలాకాశమే కద....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment