పురివిప్పిన ఊపిరి
తేదీ : 25-06-2021
శీర్షిక : ఋతువు మార్పు ...
కవిత సంఖ్య : 696
గ్రీష్మ తాపాలకు గిల గిలలాడి
నిలదొక్కుకున్న తరువులు
పచ్చదనమన్నది మాయమై
నెర్రెలూనిన నేలమ్మకు...
ఋతువు మార్పుతో బతుకు
చేతబట్టినట్టు ... చిటపటల
చినుకుల పలకరింతలతో
భూదేవంతా పచ్చదనం పూనింది ....
కాలుష్యాలు కొంత కనుమరుగయి
పరుగు పెట్టిన వరద నీటితో
వాగు వంకలన్నీ పొంగి పొర్లగానే
పరవశించిన ప్రకృతమ్మ
మనసు మురిసిన జీవజాలం .....
ఆహ్లాదాల ఆమనిలో మునిగిన
మనసుల నిండా మమతల మూటలై
కొంగ్రొత్త ఊపిరులు పులుముకుని
తేలి పోతున్నది ఆకాశయానంలో .....
పురివిప్పిన పచ్చదనాలతో
పున్నమి రాత్రుల తలచుకుని
వెన్నెల గానం ఆలపించాలని
మదిలో మెదిలిన మెరుపు నక్షత్రం .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment