చెరువు
తేది :07-09-2018శీర్షిక : ఊరుమ్మడి బతుకు
సంఖ్య : 51
స్వాగతాల తోరణమే మా ఊరి చెరువు .
జోరు వానలందుకుంటే పడువాటుకు నిండు.
మత్తడి దునికిందంటే చిన్నపాటి జలపాతమే.
చెరువు నిండిందంటే ఊరు ఊరంతా పండగే.
చేతి వృత్తు లందరికి చెల్లి పోవు కష్టాలు.
పిల్లా పాపలందరికి సంబరాల అంబరం.
ఈతలకు ఊతమిచ్చే ఆటలకు నెలవు.
భూగర్భ జలం పెరిగి బావులకు బలం.
ఊరందరి బట్టలకు ఉతుకు రేవు నిజం.
సాగు నీటి కష్టాలు సాదరంగ తీరు.
ఒడి నిండిన అమ్మలా అందమైన చేపలకు
అలవికాని బెకబెకల గోండ్రు కప్ప కుప్పలకు
జర జర పాకి జడుపు పెట్టె వాన పాములకు
అప్పుడప్పుడు కనిపించే తాబేలు భామలకు
ఆలవాలమౌతుంది జలచరాలకు జీవనాధారం.
అలల సవ్వడులతో ఆనందాలను పంచు.
నడి మధ్యన తుమ్మలపై వాలే కొంగల గుంపులు
తెల్ల పూల పెద్ద బతుకమ్మను తలపించు.
పశు పక్ష్యాదుల కిల కిలలతో పరవశాలనిచ్చు.
పచ్చ తివాచీ పరిచినట్టు పల్లె పరవశించు.
చెరువు లేని ఊరు ఉందంటే అచ్చెరువే!
గొలుసుకట్టు చెరువులు వరదపోటు నివారించు.
ఒక ఊరి పడువాటు పక్కూరు చెరువు నిండు .
మానవ మేధస్సుకు మణిహారపు మచ్చుతునకలు.
ఎండాకాలమొచ్చిందంటే నెర్రెలతో విర్రవీగు.
ఒండ్రు మట్టి వరి చేలకు నింపు చేవ.
ఎండిన తుమ్మకాయ గొఱ్ఱెమేక ఆహారం.
పిల్లల ఈతలకు ఊరందరికీ మెతుకు
పశువుల స్నానాలకు
మత్తడి దునికితే మనసుకు
ఎక్కడ లేని ఆనందం....
చేపలకు కొదువలేదు
వరదలకు అడ్డుకట్ట
తాగు నీరు సాగు నీరు
కుల మత బేధాలు లేవు....
బతుకమ్మలను వేసేది
గొలుసుకట్టు ఒక ఊరి పడువాటుతో
ఇంకో ఊరు చెరువు నిండు...
ఎండాకాలం వస్తే తుమ్మ కాయకు
గొర్రె మేకకు భోజనం -
ఒండ్రు మట్టి పంటపొలాలకు
చాకలికి బట్టలుతుకే కేంద్రం...
చాకలికి బట్టలుతుకే కేంద్రం...
ఒండ్రు మట్టి ఒంటికి తలంటుకు స్నానాలకు
ఆషాడం శ్రావణం నిండితే రెండు పంటలు
ఊరి బావులకు నీటి ఆధారం భూగర్భ జలాలు పెంచు
కప్పలు తాబేళ్లు నీటి పాములకు నిలయాలు
చేరువేలేని పల్లె లేదంటే నమ్మం...
ఆషాడం శ్రావణం నిండితే రెండు పంటలు
ఊరి బావులకు నీటి ఆధారం భూగర్భ జలాలు పెంచు
కప్పలు తాబేళ్లు నీటి పాములకు నిలయాలు
చేరువేలేని పల్లె లేదంటే నమ్మం...
ముందు చూపు మనిషి విజ్ఞానానికి మచ్చు తునక
చెరువు నిండిందంటే వడ్లకమ్మరోళ్లకు వడి కలిగిన గిరాకీ .
సుంకరన్నకు తమాం పని తూము నిగురాని కోసం
Nagunuri Rajanna Presnetly at RICHMOND,USA
Retd.Dy.Mgr(F)
NTPC Rdm
Karimnagar
సుంకరన్నకు తమాం పని తూము నిగురాని కోసం
Nagunuri Rajanna Presnetly at RICHMOND,USA
Retd.Dy.Mgr(F)
NTPC Rdm
Karimnagar
No comments:
Post a Comment