అల్లుకున్న ఆశాలతలు
తేదీ : 30-06-2021శీర్షిక : అందమైన వాహ్యాలి
కవిత సంఖ్య : 700
అంశపు ఛాయలలో తచ్చాడగానే
ఆలోచనలన్నీ బాల్యపు గుమ్మంలో
పారాడి... పురివిప్పిన ఆశాలతలై
అల్లుకున్నవి నా తనువంతా ......
పుట్టి బుద్దెరిగిన నాటినుండి
పురుడు పోసుకున్న ఊసులన్నీ
మట్టితో పెనవేసుకున్న బంధాలన్నీ...
హుషారు విహంగాలై ఒక్కొక్కటిగా
నా మనో ఫలకంపై వాలుతూ .....
ఆటపాటల్లోన అనుభవించిన
ఆనాటి తీపి మధుర క్షణాలు
అన్నదమ్ములతోడ అల్లుకున్న
అనుబంధాలు ... అప్పుడప్పుడు
పూనిన అలకలు... మిత్రులతో
జరిపిన గిల్లి కజ్జాలు... సప్త వర్ణ చిత్రాలై ...
ఆత్మీయతల ముల్లె అమ్మ క్రమశిక్షణలు
అనురాగాల పూదోట నాన్న కట్టుబాట్లు ...
పుట్టి పెరిగిన పొదరిల్లు ... పరిసరాలు
అనుక్షణం అనుభవాల నందనంలో
అందమైన వాహ్యాలే కద పదవీ విరమణ
పర్వంలో ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment