జల గీతాలు
తేదీ : 26-06-2021శీర్షిక :జలం విలువ
కవిత సంఖ్య : 697
చేయి చేయి కలుపువయా
చేతనయింది నిలుపువయా
వరద పారు సెలయేళ్ళు
వాన నీటి జీవనదులు
అవే కదా ఆనవాళ్లు
ఆనాటి నాగరికతలకు // చేయి //
జలమేరా జీవరాశి మూలం
ఆ జలం విలువ
తెలుసుకొనుటే
మనిషిగ మన ధర్మం // చేయి //
ప్రతియేటా చెట్లు నాటి
పచ్చదనం పెంచవయా
దట్టమైన వనసంపద
వాటమైన వర్శమిచ్చు ... // చేయి //
అమాయకపు సెలయేళ్ళను
అన్యాక్రాంతం చేయబోకు
నిఖార్సయిన నదీమలను
నిలువెళ్ళా దోచెయ్యకు // చేయి //
తాగు నీరు సాగు నీరు
ప్రాణప్రదం జీవాలకు
కలుషితాలు నింపబోకు
విషతుల్యం చేయబోకు // చేయి //
ప్రాణాలను నిలిపేటి
పంచభూతాత్మలను
పట్టినా ముట్టినా
పబ్బతులే ఆనాడు // చేయి //
అనుభవాల సారమే
ఆచారం సంప్రదాయం
అవహేళన చేయబోకు
సత్వరమే గుర్తించు //చేయి //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment