చిత్ర కవిత
తేది: 17-07-2021
కవిత సంఖ్య: 37
చిత్రకారుని కలయో
కలిమాయల భ్రమయో
అల్లన రెక్కలార్చిన తీరు
అదుముకున్న తరువు ….
స్వార్థమెరుగని సరంగు ప్రకృతి
సావాసం చేసినా ఒంటబట్టని వైనం
నాగరికతల నడకలో అడుగులేస్తూ
చెట్టు చేమల చెరబట్టి పబ్బం గడుపుకుని ....
దశాబ్దాల నుండి పిండి పిప్పి చేస్తూ
మోడు మీద నేడు ప్రేమలొలుక బోసి
పుండు మీద కారం చల్లిన చందం
కాటికి పాడెగా మారే మోడు పై కూడా స్వారీ….
జీవరాశిలోకెల్లా బుద్ధికల వాణ్ణని
సుద్దులెన్నో చెప్పే మిధ్య బతుకుల
వాక్చతురుడు ఎక్కి తొక్కి కూడా
మొక్కుతున్నట్టు ఫోసులోపక్క ....
గౌరవించాల్సిన తరువును
మన తీరు మారనంత వరకు
కాలుష్యమంటు చెప్పే కల్లబొల్లి
కబుర్లన్నీ ఉత్తుత్తి హుష్ కాకీలే .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment