మళ్ళీమళ్ళీపుడతా
తేది: 07-07-2021శీర్షిక :మాటిచ్చి చెబుతున్నా
సంఖ్య :
మాటిచ్చి చెబుతున్నా
మళ్ళీ మళ్ళీ పుడతానని ...
మమతల తావి మా అమ్మ కడుపున
చదువుల తల్లి అపర సరస్వతీ దేవి ఒడిన
వేద పురాణేతిహాసాల వటవృక్ష
ఛాయలలో సేదలు దీరుతూ
రామాయణ మహాభారత సతత
హరిత కావ్యాల శ్వాసలు పీల్చుతూ ....
బంగరు తల్లి ఈ భారతమ్మ గడ్డపైన ....
అత్యంత పురాతమైన చరిత్రల
ఆధార దారాల పతంగుల నీడన
నాలుగు యుగాల బంగారు చరిత్రల
ఛత్రము కలిగిన భరత ఖండమున ....
పంచభూతాలను పట్టినా ముట్టినా
పబ్బతి పట్టే విలువల సంస్కృతి
నీడలలో.... ప్రకృతే పరమ పవిత్రమని
నమ్మే సుగుణ సంపన్నమైన సంస్కృతి
ఛాయలలో .....
ముక్కోటి దేవతల చల్లని దీవెనలతో
పూర్వీకుల పరమ పవిత్రమైన
ఆశీర్వచనములతో మళ్ళీ మళ్ళీ
పుడతానని ఆశిస్తూ అశ్వాసిస్తూ ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment