సుక్కల ముగ్గు
తేది: 12-07-2020శీర్షిక : శుచి శుభ్రతలు ....
సంఖ్య : 706
ముగ్గులన్నీ ముదితల ప్రత్యేక కళలే...
మురిపములన్నీ తీర్చుకొనంగ
అంగ రంగ వైభవమ్ముగా అవనిని
అలంకరించే రంగు రంగుల రంగవల్లులు
సుందరంగ పొంగి పొర్లే హరివిల్లులు....
అంబరాన్ని చుంబించిన
తారకాలను అలవోకగా దించి
అవనిపైన అలంకరించు ప్రతి దినం
అతివలంతా ఉదయాత్పూర్వమే .....
క్రిమి కీటకాలు దరి చేరకుండ
ఇంటి చుట్టూ పంచితంతో
కళ్ళాపి చల్లి... మల్లె తోటలా
ఎల్ల తీర్చి దిద్దెదరు తెల్ల ముగ్గులతో ......
సంప్రదాయపు సరంగులెన్నో
సన్మార్గపు దారుల్లో నడిపించ
శుచి శుభ్రతలే ప్రాణప్రదమని
ఆరోగ్య సూత్రములని గుర్తించిన
మన ఆర్యుల మార్గదర్శనంలో ...... ..
ఉత్తరాయణ పుణ్య కాలంనుండి
ప్రత్యేకముగా ఋతువు మార్పులో
బతుకు తీర్చి దిద్దుకొనంగ కొంత
సమయం సూర్య సంధ్యలో గడపడానికి ....
దినకరుణ్ణి ఆహ్వానిస్తూ అతివలంతా చేరి
అలికి ముగ్గులు పెట్టు వాకిళ్ళ నిండా
ముఖ్యంగా సంక్రాంతి సొగసులు సక్కంగ
వెలుగులీన సంప్రదాయమై శోభించు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment