నాన్నకు ప్రేమతో
తేది : 02-07-2021శీర్షిక : అడుగు జాడల్లో ముక్తి ...
గుండెల నిండా ప్రేమలు గుంభనపరిచి
కళ్ళ కదలికలలో మాత్రమే కనపరుస్తూ
పాయసం పొంగనీయని పాత్ర అంచుల్లా
కంటికి రెప్పొలే సదా కాపాడేవాడు .....
కను చూపు మేర వెలుగు కాంతులు పరిచి
రక్షణ వలయములో క్షేమంగా బంధించి
బాధ్యతల బస్తాలు తన నెత్తికెత్తుకుని
బరువులు మోసే ఉత్తి అమాయకుడు ....
క్రమశిక్షణల కరుకు బెత్తములను
అమ్మ ఝుళిపిస్తే... కంటి సైగల ద్వారా
కరుణామృతం పొంగించి బాధలు
మరిచిపోయే .. సేదలు దీర్చేవాడు .....
అనన్యమైన తన నడకలతో నడతలతో
మాకందరికి మార్గదర్శనం చేస్తూనే
అందరి మనసులు చూరగొనుడే కాకుండా
పూర్తి శతాబ్దమైనా... అయన కొడుకులుగా
నేటికీ లెక్కలేని గౌరవాలే దక్కు మాకు ప్రతిచోటా.....
ఇంతకన్నా ఇంకా కోరేదేమిటి
ఆయన అడుగుజాడల్లో నడిచి
ముందుతరానికి మార్గదర్శం
కాగలిగితే మాకు ముక్తి లభించినట్లే.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment