క్షత గాత్రం
తేదీ :01-07-2021శీర్షిక : గాయాలు ....
కవిత సంఖ్య : 701
ఒకటా ... రెండా... తొమ్మిది నెలలు
తిన్నది తాగింది నిలవకపోయినా
అడుగేస్తే ఆయాస పడుతూ
అలవికాని నొప్పుల భరింపే
ఆత్మీయతలు చాటే అమ్మతనం...
ఆపసోపాలు పడే ఆవగింజయినా
అంకురమై నిలవాలంటే
నీళ్లు తాగి ... నీలిగి...ఉబ్బి ... పొట్ట
చీల్చుకుంటేనే బట్టబయిలయ్యేది
పశు పక్ష్యాదులనుండి తనను తాను
కాపుడుకుంటేనే తరువై పంట పండేది.....
లెక్క లేనన్ని అడుగుల ఎత్తులో
లెక్క తప్పే వ్యత్యాసాల ఉష్ణోగ్రతలలో
పక్కలో బల్లాల్లాంటి కరుడు గట్టిన
శత్రుమూకలు.. ఉగ్రవాదుల ఉచుల్లోంచి
తప్పుకుంటూ తమను తాము రక్షించుకుంటూ
మనకూ రక్షణల నిస్తారు.....
ఊది చీది ఛీత్కరించినా
గునపాల గుచ్చి గుల్ల బార్చినా
కర్రు నాగళ్ళ కడతేర్చినా
డైనమైట్లు పెట్టి పొట్ట చీల్చినా
డ్రిల్లింగుల రంధ్రాలేసి ధాతువులు
లాగినా .... జీవరాశి పొట్టనింప
నిత్యం అగ్నిహోత్రమౌతుంది
ఓర్పు నేర్పుల నా అవనితల్లి ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment