దాశరథీ
తేది : 22-07-2021
శీర్షిక : కరుణాపయోనిధీ
కవిత సంఖ్య : 712
విప్లవాల గడ్డ తెలంగాణ బిడ్డ
ఓరుగల్లు వాడి కాకతీయ వేడి
కావ్యాల కర్త కరుణాపయోనిధి
దాపరికమెరుగని దయానిధీ …
బడుగులన్న ఒడువని ప్రేమ
బడబాగ్నుల విరజిమ్మిన కోట
భావ ప్రేరేపిత ప్రసంగాల తోట
జైలు గోడలు కవితల నింపినావట .....
అగ్నిధార రుద్రవీణలు
అలవోకగ అందించి
మార్పే నా తీర్పని
ఘంటాపథమైనావు .....
తిమిరంతో సమరానికి
సైతం సై అన్నావు
నిరంకుశాలు నిర్జీవమైతే
నేత్ర పర్వం పొందావు .....
వెండి తెరల జాడల్లో
దండి దొరగ నిలిచావు
లెక్కలేనన్ని రివార్డులు
లెక్కకుమించి అవార్డులు...
ఉత్తేజపు గీతాలతో
ఉరుకులు పెట్టించావు
తెలంగాణా సాధనలో
రథసారథివే అయినావు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment