అక్షరమే నా శ్వాస
తేదీ : 28-06-2021శీర్షిక : అమ్మ మనసు
కవిత సంఖ్య : 698
అంతగా తెలియని వయసులోనే
అక్షరాలే అన్నం పెడతాయంటూ
అనుక్షణం బోధించిన అనునయింపులే
అంతరాత్మకు బోధించిన ...అమ్మ మనసు ...
అలా అలా అల్లుకున్న ప్రేమలు
అక్షరాలపై ఏర్పరుచుకున్న మమతలు
అలవోకగ ఒంటబట్టించుకున్న పాఠాలు
అగ్రాగామిగా నిలబెట్టిన మధుర క్షణాలు ....
పల్లె దాటి పట్నంలో అడుగిడగానే
స్వతంత్రించిన లేగదూడలకు కంచె
వేయని పంటపొలం కంట పడినట్టు
అలవాట్ల పొరపాట్లు చేస్తూ....అప్పుడప్పుడు
గాడి తప్పినా .....
ప్రతి నెలా ...పల్లె తల్లిని పలకరించే
వేళలో అమృతవల్లి మా అమ్మ మాటలతో
మళ్ళీ గాడిన పడేది.. మా బుద్ది... వల్లె వేసిన
విద్యార్ధి నోట లెక్క తప్పని ఎక్కంలా ...
అలా అలా అక్కున చేర్చుకున్న అక్షరం
ప్రాణవాయువై నిలిచి నేడు ప్రాణప్రదమాయె
పడుకున్నా మెలకువగా ఉన్నా తప్పని
ఉచ్వాస నిచ్వాసల ఊయలలూగుచున్నది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment