పదాల కవిత
తేది: 09-07-2021
శీర్షిక: ఆశావహం…
కవిత సంఖ్య: 704
పదాలు : అవకాశాలు, సరిలేరు
సహానుభూతి, మానవత్వం
ఆత్మస్థైర్యం, ప్రేరణ,పంచుదాం
అందిపుచ్చుకోవాలె గానీ
ఆత్మస్థైర్యం గుండెల నిండా వంపుకుని
అనంతమైన ఆశావహములే…అవకాశములే…
విజ్ఞులెప్పుడు వీగిపోరు విర్రవీగరు
అవకాశాలను సృష్టించుకుంటారు….
మనో పరిమిత చట్రంలో బందీ కాకుండ
మానవత్వ పరిమళాలు వెదజల్లితే
జీవన గెలుపు బాట చేరదా..నీ ముంగిట
వాలదా.. సరిలేరు నీకెవరటంచు…
అప్పుడప్పుడు అపజయాలు
పలకరించినా.. సహానుభూతుల
భయాల నీడల జాడలు వదిలి…
పట్టుదలలే మెండైన పెట్టుబడిగా…
కృషి ప్రయత్నాల సాగు నువు చేస్తే…
మంచితనపు మరువ దమనాల
పరిమళాలను మనమే వెదజల్లి
ప్రేరణలై పెన్నిధిగా నిలుద్దాం….
భారతీయ సంప్రదాయ సుగంధాలను
పంచుదాం సౌభ్రాతృత్వపు ఛాయలు నింపి…
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment