కల్యాణ తిలకం
తేదీ : 30-06-2021శీర్షిక : సత్సంప్రదాయం ...
కవిత సంఖ్య : 33
కట్టు బొట్టుల కమనీయం
కళాత్మకమైన శుభ సూచకం
కనుబొమల నడుమ కాంతివలయం
కనికట్టుగ కట్టిపడేసే హైందవం...
తిలకం ..కుంకుమల తీరొక్క రకం
ఒక్కొక్క బొట్టు ఒక్కో ప్రత్యేకం
దృష్టి అరిష్టాలకు విరుగుడంటూ
వెల్లివిరిసిన ఆచార సంప్రదాయం .....
సవ్య దిశన సంఘపురోభివృద్ధికై
నిలిచే సత్సంతాన వ్యవస్థార్థం...
ఉత్తమ ఉపనిషత్తుల ఉపయుక్తమైన
సమంత్రీక పెళ్లి తంతులో వెలిసిన
ముప్పదారు పెళ్లి ముచ్చట్ల
మురిపాల పట్టికలో మున్ముందటి
తతంగమే పెళ్లి అలంకరణలు .....
మంగళ స్నానాల ఘట్టములతో
చీని పట్టు పీతాంబరముల ధరింపజేసి
కాళ్లకు పారాణి కమనీయం చేసి
కల్యాణ తిలకాల దిద్దుబాటులతో
సుందర మెహందీ అలంకరణలతో
కనులకు కాటుక చెక్కిలిపై దిష్టి చుక్క ...
బాసికముల బందనములతో
ఉట్టిపడే పట్టు పీతాంబరాలతో ...
స్వర్ణ నవరత్న ఖచిత ఆభరణాలతో
నాజూకు అలంకరణలు నాసికా కర్ణముల...
వరుడు వధువులు విశిష్టములై నిలువ
సంస్కృతీ సంప్రదాయ సంపదల
సంస్కరింపబడటమే... ప్రధానమై
ఆయురారోగ్యముల భోగమే అవనిలో
మేలైన భాగ్యమై నిలిచె .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment