బార్టర్ బతుకులు
25-04-2021
చిత్ర కవిత
శీర్షిక :గతి తప్పిన వ్యాపార నీతి
కవిత సంఖ్య :
బార్టర్ విధానంలో బతికిన రోజుల్లోన
పల్లెయినా పట్నమయినా
ఇచ్చిపుచ్చుకుంటేనే ఇలవరుసగా
బంగారు జీవనం సాగేది ....
ఏది ఏమైనా ఎన్ని చెప్పినా
భారతానా నాటి వ్యాపారంలో
బహు నీతిగా సాగిందనేది
బహుళ ఆమోదితమే ....
మానవత్వపు ఛాయ పరిధి దాటి
మసి పూసి మారేడు చేయలేదు
అందుకే గుప్తుల కాలం గుంభనంగా
స్వర్ణయుగమై విరాజిల్లినది ....
నాడు వర్తకులు రాజుకు కప్పం
కట్టి పాలనలకు సాయమందిస్తే ....
నేడు వలస వాదన స్వార్థ విధానాల
కనుసన్నల్లో పార్టీలకు పంచుతూ
పతనాలకు నాందీ పలుకుతున్నారు
నాటి భారత వ్యాపారులు
అవసరాలను అందుకుంటే ...
నేటి విదేశీ కార్పొరేట్లు
అవసరాలను సృష్టిస్తున్నారు ....
భావ వాదమైనా ... పదార్థవాదమైనా
నియమాలకు పరిమితులకు లోబడి
స్త్రీ పురుషులై అన్యోన్యత పాటిస్తే
ఆనందమయమైన జీవితమే .....
విదేశీ వింతలో వికారాల మోజులో
రెండూ కానీ మానసిక స్థితితో కొట్టు
మిట్టాడుతూ వ్యాపారం కొరకు కొత్త కొత్త
పుంతలుతొక్కి లేనిపోని మొండి
రోగాలను వ్యాప్తి చేస్తున్నాయి .... నేడు ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment