నగునూరి రాజన్న
అంశం - భావ ప్రకటన
తేదీ - 24-09-2019
శీర్షిక - అమ్మ భాష
సంఖ్య - 295
అమ్మ కడుపున పుట్టడమే అదృష్టం
అమ్మ భాష ఆత్మీయతల మూటగా
శిరోధార్యంగా నెత్తిన పెట్టుకుని ...
ముత్యమంటి తెలుగు పలుకులు ముదము గొల్ప
అక్షర జ్ఞానం నింపి నాకు
ముచ్చటించే వరమిచ్చిన తొలి గురువుగ
అమ్మ భాషనే అనుకరిస్తా !
అక్షర జ్ఞానంతో కూర్చిన
పద సంపదకు అవసరం లేదేమో
రంగులద్ది సొబగులు దిద్దడం అదనంగా ...
ఆత్మీయతలు చాటి మానవీయతను
మేల్కొలిపి పరి జనుల మనుగడలలో
సుగంధాలు వెదజల్లితే చాలనుకుంటాను!
రంగు రంగుల పక్షులు
ముద్దులొలికే చిలక పలుకులులా
విచిత్ర భంగిమలతో దృష్టి మరల్చక
నలుపు పులుముకుని
కొమ్మల చాటున దాగిన
కోయిలమ్మ కులికే తీయని కంఠమోలె
మధుర సంభాషణ చాలనుకుంటాను !
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
అంశం - భావ ప్రకటన
తేదీ - 24-09-2019
శీర్షిక - అమ్మ భాష
సంఖ్య - 295
అమ్మ కడుపున పుట్టడమే అదృష్టం
అమ్మ భాష ఆత్మీయతల మూటగా
శిరోధార్యంగా నెత్తిన పెట్టుకుని ...
ముత్యమంటి తెలుగు పలుకులు ముదము గొల్ప
అక్షర జ్ఞానం నింపి నాకు
ముచ్చటించే వరమిచ్చిన తొలి గురువుగ
అమ్మ భాషనే అనుకరిస్తా !
అక్షర జ్ఞానంతో కూర్చిన
పద సంపదకు అవసరం లేదేమో
రంగులద్ది సొబగులు దిద్దడం అదనంగా ...
ఆత్మీయతలు చాటి మానవీయతను
మేల్కొలిపి పరి జనుల మనుగడలలో
సుగంధాలు వెదజల్లితే చాలనుకుంటాను!
రంగు రంగుల పక్షులు
ముద్దులొలికే చిలక పలుకులులా
విచిత్ర భంగిమలతో దృష్టి మరల్చక
నలుపు పులుముకుని
కొమ్మల చాటున దాగిన
కోయిలమ్మ కులికే తీయని కంఠమోలె
మధుర సంభాషణ చాలనుకుంటాను !
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment