నగునూరి రాజన్న
ధృవ తార
తేది 21-11-2019
శీర్షిక - మార్గదర్శకులు ....
సంఖ్య - 318
కఠోర పరిశ్రమలను కంఠ హారాలుగ ధరించి
క్రమశిక్షణలను చంకన బెట్టుకుని
పట్టుదల దీక్షలను శ్వాసిస్తే
పట్టుబడే ఉన్నత శిఖర గమ్యమే ....
అంధకారాలు అలుముకున్న వేళ
ఆర్తితో తలుచుకుంటే చాలు తమకమై
పోల్చుకుంటే చాలు మార్గదర్శనమౌ ...
అనితరమైన అనన్య సాధకులు
అప్పుడప్పుడు మాత్రమే తారసపడతారు ......
ఆదిశక్తి కాళీ మాత అభయాలను
అందిపుచ్చుకున్న పరమహంస
పరివ్రాజకులైన రామకృష్ణుడి ప్రియ శిష్యుడు
భరతమాత ముద్దు బిడ్డడు నరేంద్రుడు....
నిరంతర స్వయాన్వేశి,
స్వయం క్రమశిక్షణలు సంధించుకుని
సానబెట్టుకున్న సంయమన శీలి.....
అతివాదాలను మితవాదాలను అధిగమించి...
కఠోర నియమ నిష్ఠలు విధించుకుని
సత్య సంధత, అహింస, సత్యాగ్రహం
సహాయ నిరాకరణ, నిరాహారదీక్షలు
ఆయుధాలుగా మలుచుకుని
ఆసేతు హిమాచలాన్ని ఒక్క మాటపై నిలిపి
రక్తమోడని రక్షిత స్వాతంత్య్రం సముపార్జించి
పదవులాశించని ప్రజల మనిషిగా
సచివాలయాల జాతి నేతగా
పదవులాశించని ప్రజల మనిషిగా
సచివాలయాల జాతి నేతగా
విశ్వానికే మార్గదర్శియైన వినయశీలి
మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ.....
అందిపుచ్చుకునే అవకాశాలు లేకపోయినా
ఆత్మ స్థైర్యం ప్రోది చేసుకుని
అనితరసాధకుడై ఎదిగిన అబ్దుల్ కలాం గారు ....
అందరూ దృవ తారలే.....
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు .....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment