ఆనంద నిలయం
తేదీ - 11-12-2019
శీర్షిక -
సర్వమతాదరణం.....
సంఖ్య - 331
విశ్వ దేశాల వినీలాకాశంలో
వింత పోకడల విధి విధానాలు ....
ఎవరికి వారే యమునాతీరే .......
అవిభాజ్య కుటుంబాల ఊసులు లేవు .......
అంటు సొంటుల ఆత్మీయతలు కానరావు ....
విశ్వ దేశాలను విడమరిస్తే....
అవుతే ఇస్లామో కాదంటే కిరస్థానమో... కానీ..
ఆనవాళ్లన్నీ స్వార్థ సంకేతమే
అనుపానులు సర్వ హితం నాస్తి...
అక్కడక్కడా చెదురు మదురైనా
అన్ని జాతి మతాలకు ఆలవాలం...
అందరికి
అందుబాటు
ప్రశాంతం
.....
అన్నీ కుదిరేది ఇక్కడే.....మన దేశాన
కక్షలు కార్పణ్యాలకు నెలవు
కాదు
కఠిన నియమాల జాడలు లేవు....
భాష ఏదైనా మతమేదైనా దేశమేదైనా
బహు చక్కని బతుకు సీమ ఇదే...... భారతం
అల్లాహో అక్బరన్నా....
ఆ యెహోవానే రక్షకుడన్నా....
పరమత సహనం పరమ విశిష్టం
సర్వమతాదరణ సరళతరం ఇక్కడే......మన దేశాన....
అందుకే ఆనంద నిలయం మన భారతం.....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment