ధనుర్మాసం
16-12-2019
శీర్షిక -
మార్గళి వైష్ణవారాధన
సంఖ్య - 334
ఉత్తరాయణం పగలై వెలుగొంద
దక్షిణాయనం నిశిగా నిలువంగఁ
ఉషాకాలమాయె సురలకు మార్గశీర్షము
బ్రహ్మీ ముహర్తమై బాసిల్లుచుండ....
మాసోహం మార్గశీర్షోహమంటూ
మధుసూదనుండే సెలవిచ్చే కదా !
విభూతి యోగంలో వివరించె
మద్భగవద్గీతయందు ప్రీతిపాత్రంగా....
తులసీవనమున జన్మించిన
విష్ణు చిత్తుని తనూజ భక్తిమీరగ
పూదండల హారములు కూర్చి
మధురమైన మేల్కొలుపు పలుకులతో
పాశురములుగా పాడి తన్మయించె ....
పాంచజన్యుణ్ణి కీర్తించె
పవిత్రంగ
....
తెల్లవారెనని భామలందరిని
పరుగు పరుగున రారండంటూ....
పక్షుల కిల కిలా రవముతో రమణులందరిని
రంగధాముని సేవకు వెళాయేనంటూ.....
మనకు విశదపరచె వ్రతమాచరించి
మాస విశిష్టతను మనసుబెట్టి గోదాదేవి .....
ముక్తిమార్గమునకు శీర్షమై నిలిచె మార్గళిగా !
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment