నగునూరి రాజన్న
చంద్ర హాసం
తేదీ 05-12-2019
శీర్షిక - చంద్ర హాసం
సంఖ్య 328
ఖగోళ చక్రబంధములో ఉపగ్రహం
నిశి రాత్రుల చెరబట్టే వెన్నెలకాడు
ఆనవాయితీగ
అమ్మ తమ్ముడైనా
అమృతం కురిపించే చంద్రుడు సుమా.....
గ్రహ పరిభ్రమణాల పరికల్పనలో
ప్రభావవంతమైన నక్షత్ర రేడు
దినకరుని అనుంగు ప్రకాశితుడు
వేడి తెలియని వెలుగులిచ్చే వన్నెకాడు....
కవి హృదయాలను కదిలించే సాహిత్యం
యువ హృదయాలను ప్రేమించే సాన్నిహిత్యం ....
కృష్ణమందు క్షీణిస్తూ..... శుక్లమందు వృద్ధి చెందుతూ
పాలనురగల ప్రవహింపజేసి
కటిక చీకట్లను కరవాలమై ఝులిపిస్తుంది....
జీవితమంటే కష్ట సుఖాల కలబోతలేనని
కలిసి పయనించే బాటసారులేనని
కాల గణనాలకు మూలమై నిలిచి
మీన మేషాల పంచాంగమైనా స్థితప్రజ్ఞతకు సూచీ ......
నవీన నాగరికతల పోకడలతో
నక్షత్రాల సాపేక్ష సిద్ధాంతాలతో
సాంకేతిక సొబగులద్దుకుని
నూతన ఖగోళ విజ్ఞానాలకు కేంద్రమయ్యింది.....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment