నగునూరి రాజన్న
అంశం - యుగళ గీతం
తేదీ 22-11-2019
శీర్షిక -
కళల కాణాచిలో కలికితురాయి
సంఖ్య -319
శ్రమైక జీవన సంద్రాన కొట్టుమిట్టాడే వేళ
ఆటపాటల ఆనందాలే తీరం చేర్చే నావలు ....
నిత్య బతుకు పోరాటాల కడలిని దాటించే
కూని
రాగాల
కోయిల మధురిమల కూజితాలు...
అలుపు సొలుపుల ఉపసంహరణలకు
అంతరంగపు భావ ప్రకటనల రూపాలు
అంగాంగ ఉపాంగాలే
భాగవత నాటకాలు
సామాన్యుల సప్తవర్ణ సంతోషాల నిలయాలు
సమయానుకూలంగా
సంధించుకున్నది
సాంకేతికతల సొబగులద్దుకుని
సంక్షిప్త భావాల శబ్ద చిత్ర రూపంగా.....
పౌరాణికాలతో ప్రారంభమైనా
చారిత్రిక సాంఘికాలతో సావాసం చేసినా
విప్లవోద్యమాలతో విలసిల్లినా
కుటుంబ కథలతో ఫరిడవిల్లినా
దశాబ్దానికో దిశను మార్చుకుంటూ
దూసుకెళ్తున్న
మలుపుల సాధనం.....
కాలమేదైనా కళల చిత్రమేదైనా
కమ్మని భావాలు పంచే
యుగళ గీతం
నాయికా నాయకుల ప్రేమలకు సాక్ష్యం
కళల కాణాచిలో కలికితురాయి .
నగునూరి రాజన్న
కరీంనగర్.
No comments:
Post a Comment