నగునూరి రాజన్న
అంశం - నిర్వేదం
తేదీ - 25-09-2019
శీర్షిక - క్రమశిక్షణ
సంఖ్య - 296
ఆమోదయోగ్యమైన అమలు విధానాలు
నిలుపు కదా నిన్ను ప్రత్యేకతగా .....
పట్టు వదలక పాకులాడే నిష్ఠతో
క్రమశిక్షణ కలిగి నీవు కదిలితే
ప్రయత్నాన వచ్చే ఫలితం
అవుతుంది నీకు సొంతం....
అధిగమించు నిర్వేదం......
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
అంశం - నిర్వేదం
తేదీ - 25-09-2019
శీర్షిక - క్రమశిక్షణ
సంఖ్య - 296
ఆశ మనిషికి గమ్యం ఏర్పరిస్తే
ఆశయం గమనం నేర్పిస్తుంది
అత్యాశ దురాశలే అతలాకుతలం చేస్తాయి
నిరాశ నిస్పృహలకు మార్గమేర్పడుతుంది....
కాలంతో సమానంగా పోటీపడినా
కనికరించదు కొన్నిసార్లు
ఆదరా బాదరా అందుకుంటానంటే
అనుకున్నది జరగదు ఏ కోశానా ...
పరిష్కరించలేని ప్రశ్నలైనా
ప్రశాంతంగా కొంత యోచిస్తే
పట్టు పడుతుంది ఖచ్చితంగా
ప్రత్యమ్నాయాల పుష్కలాలు ....
క్రమానుగత మేథోమథనం
వైవిధ్యమైన వివేక వివేచనం
ఆచరణాత్మక ప్రణాళిక రచనలుఆమోదయోగ్యమైన అమలు విధానాలు
నిలుపు కదా నిన్ను ప్రత్యేకతగా .....
పట్టు వదలక పాకులాడే నిష్ఠతో
క్రమశిక్షణ కలిగి నీవు కదిలితే
ప్రయత్నాన వచ్చే ఫలితం
అవుతుంది నీకు సొంతం....
అధిగమించు నిర్వేదం......
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment