నగునూరి రాజన్న
అంశం - అపురూపగీతం
తేదీ - 26-09-2019
శీర్షిక - అపురూప గీతాలు.. పవిత్ర యజ్ఞాలు
సంఖ్య - 297
అహింసాయుత స్వాతంత్య్ర సమరాన
అపర సమర శంఖారావమై నిలిచే కదా
వందేమాతరమంటూ జాతీయ గేయమైన
ఆనాటి బంకీమ్ చంద్రుని మనో కవనం .....
ఆసేతు హిమాచలాన్ని అనురక్తితో
అనుసంధానించి అక్షరీకరించిన
జనగణ మన అధినాయక జయహే
విశ్వ కవి రవీంద్రుని విరచితము....
సాంప్రదాయపు ఒరవడిని దాటుకుని
సగటు మనిషి హృదయాన్ని చేరిన
సమకాలీనతల వ్యావహారిక భాషతో
కోటలు దాటిన గురజాడ గారి మాతృభాష పాటలు ....
తెలుగువారందరిని ఒకటిగా నిలిపి
ఓలలాడించిన తేజపు గీతం
శంకరంబాడి సుందరాచారి గారి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ ....
మలిదశ తెలంగాణ ఉద్యమాన
మకుటాయమానమై శోభించె కదా ..
మరుపురాని అపురూప గీతమై
అందెశ్రీ అందించిన తెలంగాణా గీతం....
తనువు చీల్చి మనుఫు నిలిపిన
మాతృమూర్తిలా ప్రతి కవికి తన కవనం....
సంఘం మెచ్చిన పిల్లల ప్రయోజకత్వంలా
కాలమానపరిస్థితులకు కలిసి వచ్చే
ప్రతి గీతం ఒక పవిత్ర యజ్ఞమే ...
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
అంశం - అపురూపగీతం
తేదీ - 26-09-2019
శీర్షిక - అపురూప గీతాలు.. పవిత్ర యజ్ఞాలు
సంఖ్య - 297
అహింసాయుత స్వాతంత్య్ర సమరాన
అపర సమర శంఖారావమై నిలిచే కదా
వందేమాతరమంటూ జాతీయ గేయమైన
ఆనాటి బంకీమ్ చంద్రుని మనో కవనం .....
ఆసేతు హిమాచలాన్ని అనురక్తితో
అనుసంధానించి అక్షరీకరించిన
జనగణ మన అధినాయక జయహే
విశ్వ కవి రవీంద్రుని విరచితము....
సాంప్రదాయపు ఒరవడిని దాటుకుని
సగటు మనిషి హృదయాన్ని చేరిన
సమకాలీనతల వ్యావహారిక భాషతో
కోటలు దాటిన గురజాడ గారి మాతృభాష పాటలు ....
తెలుగువారందరిని ఒకటిగా నిలిపి
ఓలలాడించిన తేజపు గీతం
శంకరంబాడి సుందరాచారి గారి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ ....
మలిదశ తెలంగాణ ఉద్యమాన
మకుటాయమానమై శోభించె కదా ..
మరుపురాని అపురూప గీతమై
అందెశ్రీ అందించిన తెలంగాణా గీతం....
తనువు చీల్చి మనుఫు నిలిపిన
మాతృమూర్తిలా ప్రతి కవికి తన కవనం....
సంఘం మెచ్చిన పిల్లల ప్రయోజకత్వంలా
కాలమానపరిస్థితులకు కలిసి వచ్చే
ప్రతి గీతం ఒక పవిత్ర యజ్ఞమే ...
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment