నగునూరి రాజన్న
అంశం - అదృష్టం
తేదీ - 13-09-2019
శీర్షిక - సమయ సమర్థత ...
సంఖ్య - 287
సమర్థ సమయ వినియోగం
సామర్థ్యాన్ని సానబెట్టుకోవడం
అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడం
అందిపుచ్చుకోవడమే అదృష్టం.....
మొక్కజొన్న పొత్తుల్లా కొంతమంది
అన్నీ అమరినట్టుండి ఎండా వాన
కష్టమెరుగక నీరు పట్టి నిగ నిగలాడుతూ
సంతోషాలను మాత్రమే ఆస్వాదిస్తుంటారు....
కొంతమందికి స్వంత పనులు కూడా
పక్కవారు చేస్తుంటే లాహిరి లాహిరి
కోయిలమ్మ కమ్మని కూజితాలవలె
రాగాలాపనలకే సరిపోతుంది.....
అధికారం అందలాలనిస్తుంది
పేర్లు మారినా వరాలు మారలేదు
పెట్టి పుట్టింది పాలన నాయకగణం
అటు ఇటుగానైనా అదృష్టమే వారి స్వంతం....
తాత ముత్తాతల తరం వల్లనో
తరగని ఆస్తుల నీడల వల్లనో
వారసత్వంగానో కొంతమందికి
వద్దన్నా ఎదురొస్తుంది... అదృష్టం అన్నింటా
అందరిని ఆ గాట కట్టలేం ....
అలా అని విడిచి పెట్టలేం ....
అందరికి అదే సూత్రమనుకుంటే
అంధకారమే ఎదురౌతుంది...
మార్పును ఒంట బట్టించుకుని
అభిప్రాయాలను సవరించుకుంటూ
నిన్నటి కంటే నేడు... ఇంకా రేపు ..
వివేక ప్రదర్శన చేసుకుంటే.....చిక్కును తథ్యం...
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment