చిత్ర కవిత
తేది: 13-05-2022
శీర్షిక : ఎదురు చూపులు
కవిత సంఖ్య : 129+2
ప్రియ సఖా ....
ఎదలో ఎద చేర్చి
కూర్చనా రాగాలు...
మది వీణియగా మార్చి
మానసాన్ని శృతి చేసి .....
రాగం తాళాలను
రంగరించి .....
పల్లవి చరణాలను
సంధిస్తూ .....
పండు వెన్నెలల
రాకలకై ....
కలువ కొలనుల
భామలకై ....
ఎదురుచూస్తూ ......
భ్రమర నాదముతో
భంగమైన ఏకాగ్రతలు
పిల్ల తెమ్మరల భ్రమలు
వీడిన ఏకాంతములు .....
మనమున నిలిచిన
మోహన భావపు
ఊహల సుందరా ...
వేగమే దరి చేరవా...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment