శాంతి నికేతనం
తేది 09-05-2022
శీర్షిక : ఆసేతు హిమాచలం ....
కవిత సంఖ్య : 899
కాశ్మీరం నుండి కన్యాకుమారివరకు
చిన్న చిన్న సంఘర్షణల లెన్నున్నా ....
భవ సాగరాల భక్తి పారవశ్యాలు పండించే
భరతమాత తనకు తానై హింస కోరలేదెప్పుడు .....
వందిమాగదుల దొంగ దెబ్బలతో
వందలేండ్లు వలసవాదులేలినా ....
తల్లడిల్లినారే కానీ .... తల బిరుసుగా
రక్తపు టేరులు పారించలేదెప్పుడు ....
పదిహేడు సార్లు ఓటమిని క్షమించినా
పామును పక్కలో పడుకోబెట్టుకున్నట్టు
పద్దెనిమిదవసారి దండయాత్రలో
వెంబడించి చంపబడిన చక్రవర్తి భారతీయుడే ..
పగలతో రగిలినా యుద్ధమే చేసారు కానీ
పట్టు పట్టి చెరపట్టలేదు ఏ స్త్రీని ....
పరస్త్రీలనెప్పుడు పట్టుబట్టలు
పెట్టి సాగనంపిన సంగతులే మన దేశాన ...
రూపులు తెల్లన ...చూపులు కంటకింపుల ...
కల్లబొల్లి మాటలతో.. కపట నీతులతో..
కరటక దమనక జాతి చిరునామాలుగా
వాసికెక్కిన తెల్ల జాతిని తరమడానికి ..
ఆసరాగా అహింసనే ఆయుధమైనది ...
కాల మహిమలో... కాని పనుల కక్షిదారులో
కడుపు మండి కరోనాను వదిలినా ...
నమస్కారమే సంస్కారమని గొప్పగా
చాటి ... మడి ఆచారాల మతలబులతో ...
పురాతనపు విలువల పుణ్య చరితల
అడుగుజాడలకన్నా గొప్ప శాంతి
నికేతనం ఇంకేముంటుంది....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment