సామాజిక విప్లవకారుడు
శీర్షిక: సార్ధక నామధేయుడు
కవిత సంఖ్య : 888
పేరులోనే పెన్నిధిలా
పెనవేసుకున్న సార్ధక
నామధేయుడు ఫులే
సౌహార్ద్ర హృదయుడు ....
సామాజిక చైతన్యానికి
సమరశంఖం ఊదిన
సమున్నత కెరటం
సన్మార్గపు చైతన్యం .....
బడుగు బలహీనుల
విద్యకొరకు బలవంతుల
నెదుర్కొర్కొన్న బుద్ధిశాలి
వీర శివాజీకి అభిమాని .....
వివక్షలకు తావులేకుండా
విజ్ఞానం విస్తరించాలని
విభిన్నంగా ఆలోచించిన
అభినవ మేధా ప్రజ్ఞాశాలి
సాధక బాధకాలను సమీక్షించ
సత్యశోధక సంస్థ స్థాపనలతో
సంఘంలోని అసమానతలపై
సంఘర్షించిన సమన్యాయి ...
బహు గొప్పగా గురువాయే
బాబా సాహెబ్ అంబెడ్కర్ కు ...
ఎందరికో స్ఫూర్తి నింపిన
ఎవరెస్టు శిఖరం వ్యక్తిత్వం...
కార్మిక సమస్యలకు కాగడా...
బ్రాహ్మనీకాన్ని బాదిన "గులాంగిరి"
మన్ననలను ప్రస్తుతిస్తూ కీర్తిస్తూ
మహాత్మునిగా బిరుదాంకితుడు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment