పరామర్శ
తేది: 13-04-2022
శీర్షిక ; గుండెల నిండా ....
కవిత సంఖ్య :
మంచు కొండల శిఖరాల్లోనో
మండుటెండల ఎడారిలోనో
మనందరి సుఖాల కొరకు
నిత్యం మరో జన్మమెత్తుతున్నాడు ....
కన్న వారి కలలను తీర్చ
కట్టుకున్నామెకు కడుపు నింప
కనిపెంచిన పిల్లల రంగుల కల తీర్చ
కరిగిపోతూనే వెలుగులు పంచుతున్ నాడు ....
చలికి చలించిన ఒళ్ళు లార్వాలా
ముడుచుకున్నా .... వానకు నాని మేను
నానగింజయినా ... ఎండకు మండి
చర్మం బొబ్బలెక్కినా .... కుక్కిన పేనులా
నిక్కచ్చిగా నిలబడాల్సిందే కాపలాకు ....
సమయాలకు సరిగ్గా అన్నపానీయాలు
అందినా అందకపోయినా .... అసువులు
కాపాడుకునే సరంగుల సామాన్లన్నీ
నిక్కచ్చిగా పక్కాగా మోయాల్సిందే ....
కంటి నిండా మనకు నిద్రలిస్తూ
కావాల్సినంత ప్రశాంతతాలిస్తూ
కాలం సందిట్లో కరిగిపోతున్న
సైనికుని కష్టాలకు... గుప్పెడు
పరామర్శల వలువలు చుట్టి
గుండెల నిండా నింపుకుందామా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment