తలగడ
తేది : 06-04-22
శీర్షిక : తగ్గేదేలే ....
కవిత సంఖ్య 885
పరిమాణం చిన్నదైనా
పనితనాల ఫరిఢవిల్లుతుంది
అలసటలు తీర్చే ఆరాటంలో
అలరారుతుంది అమోఘమై ....
బాలకాండలో బంగారు గోడే
ఇరువైపులా ఒత్తిగిలి నిలిచి
పహారాలా పారా హుషారై
రక్షణ కవచమై రంజిల్లుతుంది
పట్టు పరుపులైనా సరే
పట్టు తప్పు... తాను లేకుంటే
దళసరిదో సున్నితమో
దన్నుగా నిలబడుతుంది ....
సుఖనిద్రలకు సుగమమై
సుందరపాత్రను పోషిస్తుంది
దుఃఖాలకు... దాపుగా నిలిచి
మిత్రునివలె ఓదార్పులిస్తుంది .....
దూదితో ఆకారమేర్పరుచుకుని
రూపాలెన్నో మార్చి మార్చి
వింత వింత రూపాల వెలుగొంది
విపణిలో వినూతనమై విరాజిల్లుతుంది ....
ప్రకటనలకు పట్టుకొమ్మై నిలిచి
పటాటోపాలను వెలగబెడుతూ
పదుగురికి పనులెన్నో కల్పిస్తూనే
ప్రజలందిరిని ఆకట్టుకుంటుంది .....
తలగడే కానీ తగ్గేదేలే అంటూ
మనువున్నంత సేపు
మనిషిని అంటిపెట్టుకునే
పటుతరమైన సాధనం .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment