మే డే 2022
తేది: 01-05-2022
శీర్షిక : జయ హో మేడే..
కవిత సంఖ్య : 893
ఆరుగాలం అరక దున్నే రైతన్న
గడియారం ముల్లుల్లా గంపెడు
చాకిరీ నెత్తికి ఎత్తుకునే శ్రామికుడు ....
ప్రజలందరి కడుపులు నింపుతూ
ప్రపంచాన్ని నడిపించే సూర్య చంద్రులు ...
జీవరాశిలో మిన్నంటూ పొంగి పొర్లే
మానవాళి ... స్వార్థాల సంచులు
నెత్తికెత్తుకుని ... సదా పక్క వాడిని
తొక్కిపెట్టాలనే మనస్తత్వాలేనాయే ...
ఎద్దేడ్సిన ఎవుసం ఎదగదన్నట్టు
చెమట చిందించి చేను పండించే
కర్షకుడు... రక్తాన్ని మరిగించి రంగు
రంగుల రాచమేడలు కట్టే శ్రామికుడు...
కంట నీరు పెడితే దేశమేరీతి బాగుపడు ...
నోరు లేని జీవాలు ఆకలికి అవసరానికి
వేటాడితే ...నోరున్న మనుషులేమో
ఉరూరా దోచుకుని తరాలకంటూ
దాచుకోను తండ్లాడుతుంటారు ....
చిలికి చిలికి గాలి వానయ్యి
చిందేసే శ్రామికులు ... ఒక్కటిగా
నిలిచి పోరే చికాగోలో ఆనాడు ....
పరిమితమయిన పనిగంటలకు పట్టం
కట్టమంటూ .... శ్రీకారం చుట్టిరి ....
దేశాలన్నీ పాకి దశ దిశలు చేరింది
చివరికి విజయం సాధించిరి .....
జయహో కార్మికా
జయహో కర్షకా .....
జయ హో మేడే..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment