మాట
తేది : 03-04-22
శీర్షిక : మానవ ఆయుధం
కవిత సంఖ్య : 245
జీవరాశిలోనే మిన్నగా చేసిన
మానవాళికో మహోన్నత వరం...
భావమార్పిడికి భవిత మార్పిడికి
బంగారం లాంటి పనిముట్టు ....
అనుభవాలను రంగరించి జోడిస్తూ
అపర మార్గదర్శిగా వెలుగొంది
ఆశల మూటగా నిలిచి
అమృతాల విత్తులు వెదజల్లాలి ...
మనసులను ద్రవింపజేసి
మానవత్వాలను ప్రోది చేసి
సాటి వారి గాయాలు మాన్పించి
చేదోడు వాదోడుగ నిలవాలి ....
భయాలను పారద్రోలి
బతుకు దారులను చూపించి
ధైర్యాలను కూడదీసుకుని
ఆశల తీగలను అల్లాలి .....
నిత్య సంస్కరణలను స్వాగతించి
సంస్కారాలను సమున్నతపరిచి
జన జీవనాన్ని జగతికి పరిచయం
చేసే మానవ ఆయుధమవ్వాలి
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment