శ్రీరామనవమి
తేది: 10-04-22
కవిత సంఖ్య : 124+5
సరిలేదు ఏ చరితం
స్మరణమే సమున్నతం
సన్మార్గపు తోరణం ...
సత్శీల రామాయణం
ఇనవంశ ప్రముఖుడు
దశరథడు మహారాజు
రాణులు మువ్వురు
మహిలోన ఘనముగా ...
పెన్నిదైన యజ్ఞఫలం
జనియించిరి నలువురు
రామలక్ష్మణ భరత శత్రజ్ఞులై
సుందరాన సుపుత్రులు....
కోరగానే రాజ ఋషి
కోరి వెడలె తోడుగా
తాటకిని వధియించి
ధర్మరక్ష గావించె ....
గురువుమాట మీరకుండ
పయనించే మిథిలకు
శివధనసును విరిచితాను
సీతమ్మను పెండ్లాడే .....
తల్లి వరము చెల్లించ
తండ్రి మాట నిలపగా
కానలకు పయనించి
కష్టాలను ఎదిరించే .....
మాయజేసి రావణుండు
మహీజాతను కొనిపోంగా
సీత జాడ తెలిసికొనగ
వాయుసుతుడు ఆసరాయె
వారధిని బంధించి
మట్టుబెట్టె రాక్షసుల ..
సీతమ్మను చేపట్టి
పాలనలకు పట్టమాయే
యుగాలెన్ని దాటినా
ఘన చరితే నేటికీ
ప్రజా పాలనలకు
పదే పదే ఉదహరణగ
పావనమే కళ్యాణం
పరికించిన కళ్ళకు
విందులే వీనులకు
వివరంగా విన్ననూ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment