కొత్త మురిపం
తేది: 04-04-2022
శీర్షిక : తాళ పత్రమే
కవిత సంఖ్య : 884
పుట్టి బుద్దెరగక ముందు
పుట్టు కూసాల సంగతెలాఉన్నా
పట్టు బట్టలు తొడుక్కున్నంత
పట్టరాని సంతోషం పదవ ఏట ...
కడుపునిండా బువ్వ దొరికి
కట్టుకోడానికి బట్టలుంటే చాలు ...
బహుదొడ్డ మహారాజులే
గడిచిన పాత గడ్డు రోజుల్లో ....
తాకితే చాలనుకున్న తమకానికి
తనకు తానై ఏకంగా ఎదురొచ్చింది ....
స్నేహితులంతా చుట్టు మూగి పోయి
ముట్టుకుంటుంటే ముడుచుకుపోయా .. .
ధవళవర్ణములో తళతళలాడే
రిన్ లాంటి తెల్లని మెరుపుల తెలుపులతో
టెర్రీ కాటన్ అంగీతో తేలిపోయిన
విహంగమే అయింది వింతగా ....
నా మనసంతా ....
కొత్తలన్నీ కొండంత ఆనందాలే
కోరినా ... కోరకున్నా ...ప్రతి జీవితంలో
పదిలమై నిలుచు పదికాలాలు
తాళపత్ర గ్రంధాలై మనందరికీ .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment