కబంధ హస్తం
తేది: 09-04-22
శీర్షిక: అధికార దాహం
కవిత సంఖ్య: 250
స్వార్థ చిట్టాలు పతాకమైతే
సంకుచిత భావాలన్నీ
స్వైర విహారం చేస్తుంటే
అంగవైకల్యం అలుముకుంటుంటే ....
సమతా మమతలు కరువై
సాటి మనుషులు కానరాక
మాట నెగ్గించుకోవాలన్న
మోటు తనాల మనస్తత్వమే ....
ప్రజాసేవలు మాయమై
పైసా యావలు పెరిగితే
పార్టీల కండువాలు మారేదే
ఓటుకు నోటు రకాలు…
ఉత్పత్తిని విచ్చిన్నం చేస్తూ
యువతను నిర్వీర్యం చేస్తూ
అధికారం గుప్పెట బంధించే
అయాచిత ఉచిత పథకాలే ...
ఆశ చావని అధికార
మదాంధుల కబంధ హస్తాల్లో
అంట కాగిన కొంటె తనాల
అగ్నికి ఆహుతులమౌతున్న
ఆశల మిణుగురులం .
నగునూరి రాజన్న
No comments:
Post a Comment