ఇ పి ఎఫ్ 95
పెన్షనర్ల వేదనలు ...
15-12-2022
పదవీ విరమణలతోనే
పరాయోళ్లమైనమా .... ?
పట్టి పట్టి అడుగుతుంటే
పట్టనట్టు చూస్తున్నరు ...
సీనియర్ల మంటుంటే
సిన్నచూపు చూస్తున్నరు ....
గుప్పెడన్ని మెతుకులతో
గౌరవంగా బతుకతం ...
నలుబదేండ్లు సేవలకు
నజరానా ఇదేనా ...
పనులు చేసి కొట్లాడితే
పరేశాను జేస్తున్నరు ...
//పదవీ //
పెద్దరికం పేరుచెప్పి
అధికారం కట్టబెడితే ...
పేనుకు పెత్తనమోలె
తలలన్నీ కొరుగుతరా ...
కోర్టు మెట్లు ఎక్కాలా ?
కోలాటాలు వెయ్యాలా ?
పార్లమెటులోపలనే
ఫైసలాలు చేయొచ్చు ...
//పదవీ //
తకురారులు లేకుండా
తగిన భృతినివ్వమంటే
కాలయాపన చేసుకుంట
కన్నీళ్లు పెట్టిస్తున్నరు ...
గౌరవంగా పనులుచేసి
పన్నులెన్నో కట్టాము...
జాతిని ఉద్ధరించే ....
మద్దతులను తెలిపాము ...
//పదవీ //
స్కీములను మార్చిమార్చి
చింతలనే మిగిల్చారు.
వంత పాడి మీరంతా
వింతలు చూస్తున్నారు ...
ప్రారంభం పట్టించుకోక
విడమరిచి చెప్పలేదు ...
నియమాలు బోధించక
ఉదకాలు వదిలిండ్రు ...
//పదవీ //
ముందు ముందు రోజుల్లో
మాదారులే మీ గమ్యం ...
అందరమూ చేరుకొనుట
అక్కడికే సుమండీ ....
ప్రజల చేత... ప్రజలకొరకు
ప్రజల పాలనంటేనే ...
తేడాలెందుకు చూపుతారు
ఉద్యోగులమైనందుకు ...
//పదవీ //
అడుగడుగున దీనపరిచి
బడుగులోలె చూస్తున్నరు ...
ఆర్డర్లకు ఎదిరిచూస్తూ
చకోరపక్షులమై వేచాము...
దేవుడు వరమిచ్చినా
పూజారి అడ్డమాయె ...
కేంద్రమిచ్చే ఆర్డర్లకు
పెన్షనోళ్లు చూడవట్టె ...
//పదవీ //
నియమాల పేరుజెప్పి
గాలికి వదిలేశారు
నిబంధనల బూచీతో
కాలడ్డం పెట్టవద్దు...
ఓటు హక్కు మాకుంది
సత్తాలు చాటగలం ...
లక్షలమంది ఒక్కటైతే
తారుమారు చేయగలం ...
//పదవీ //
పట్టి పట్టి అడుగుతుంటే
పట్టనట్టు చూస్తున్నరు ...
No comments:
Post a Comment