అంశం : బరువెక్కిన మాటలు
తేది : 19-12-202
శీర్షిక : గుండె తెప్పరిల్లును ...
కవిత సంఖ్య : సహస్రాధికం
ఆటవికతలు నిండిన అనాగరిక మార్గాలు
మూసుకుపోయి... నాగరికతల నడకలు
వెలుగులు ప్రసరిస్తున్నా ...అప్ పుడప్పుడు
అక్కడక్కడా అప్పుతచ్చుల్లాగ అడు గులు
తడబడి...అవే అనాగరికతల ఛాయలు
పొడసూపినప్పుడు ....
ఆత్మీయతల ఆనవాళ్లన్నీ కొండెక్కి
అమానుషంగా అచేతనమైనప్పుడు....
అనురాగాల కొమ్మల అపురూపాలకు
అకాల విధ్వంసం జరిగినప్పుడు ...
నెత్తికెత్తుకున్న ఆశల గంపలు
ఆగమైపోయి ...ఆశయాల గమనాలు
మూసుకుపోయి...గమ్యాలు గగనమైనప్పుడు ...
అంచనాలన్నీ లెక్కలు తప్పి
అదఃపాతాళమై కుదేలైపోతున్నప్పుడు ....
అడుగంటిన దానవత్వాలను ఆనవాయితీగా
దాపురించుకుని తట్టి లేపుతూ...మానవత్వాలకు
మరకలంటించి తుచ్ఛమైన మచ్చలను
మిగుల్చుతూ... మట్టికరిపించినపు డు ...
ఉపశమనపు పలుకులు అలుముకుంటే
సహజ రాగమై సంధానమౌను ...
గునపాలు గుచ్చుకున్న గుండె బరువులను
గుంభనంగా దించుకుని... తెలి మబ్బులా
తేలికై తెప్పరిల్లును ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment