గజల్
తేది : 16-12-2022
కవిత సంఖ్య : సహస్రాధికం
ప్రపంచాన అతిపెద్దగ
ఘనమన్నది ప్రజతంత్రం
మనమేనని విర్రవీగు
వెసులున్నది ప్రజతంత్రం
వినువీధిన
గుర్తెరిగీ
విశ్వమంత నిలపాలని
పేరాశల ఎదురుచూసు
హెచ్చున్నది ప్రజతంత్రం
నాయకులా పేరుజెప్పి
నారాజుగ ప్రజలంతా
ఓటునోటు తారుమారు
మాటన్నది ప్రజతంత్రం
పరమహంస కథలాగా
మనంకూడ మారితేనే
పరులకునూ చెప్పవచ్చు
మంచన్నది ప్రజతంత్రం
మార్పుకోరు విజ్ఞులంత
మానసాన నిలుపుకునీ
రాజులాగ వ్యవహరిస్తె
మేలన్నది ప్రజతంత్రం
నగునూరి
No comments:
Post a Comment