చూపుల సవ్వడి
తేది : 29-12-2022
శీర్షిక : నిశ్శబ్ద నీలి తరంగాలు
కవిత సంఖ్య : సహస్రాధికం
కవలలైన కనుదోయి కాంతి రేఖలు
కొసిరి పంచే కోమల హావభావాలకైనా ...
మోదమయ్యే మోహాలను ప్రకటించినా ...
కమ్మని అనుభవాలకు ఆలవాలం ....
కనులలోన బింబములై కదలాడగనే
నిగనిగల కెంపులు బుగ్గలపై నిగ్గుతేలి
అదిరే అధరముల రాగ సుధలు
సుమధురములయ్యే సుందరములు ....
చూసీ చూడనట్లుగా నటించినా...
చూపులతోనే మాటలు కలిపినా ...
మౌనమునిగా వేదనలు భరించినా ...
కణికట్టుగా కథలను నడిపించు ....
కరుకు చూపుల కత్తుల గుత్తులకైనా
నిప్పులు కురిపించి నిలువరించినా ..
దానవత్వాలు దర్షింపజేసి దహించినా ...
కరుణలు ఒలకబోసి కాపాడినా ...
జాలి ప్రకటనల దయలు జూపినా ...
నవరసాల పోషణలకు నాందీ పలికే
నాడీ కేంద్ర ప్రాతినిధ్య నాటకరాయుళ్లు ...
ఊహలకే ఊసులల్లి పురుడుపోసి
ఉదయించే నిశ్శబ్ద నీలి తరంగాలు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment